Thursday, June 12, 2014

శాశ్వత ఆత్మీయ మైత్రీ బంధం !

శాశ్వత ఆత్మీయ మైత్రీ బంధం !

ఓ రోజు మా ఇంట్లో ...

యండమూరి వీరేంద్రనాథ్, చల్లా సుబ్రహ్మణ్యం, దంతూరి పండరినాథ్ !


గొల్లపూడి మారుతీరావు నన్ను ఇంటర్వ్యూ చేసారు.

గొల్లపూడి మారుతీ రావు గారు నన్ను ఇంటర్వ్యూ చేసారు

Interviewed by Sri Gollapudi Maruthi Rao on the success of my serial novel "Chanderi" published in Andhra Bhoomi Weekly dated 31-12-1998.

Photo: Interviewed by Sri Gollapudi Maruthi Rao on the success of my serial novel "Chanderi"  published in Andhra Bhoomi weekly (1998).

Gollapudi 2

Gollapudi 3
   

"భువన విజయం"

I was honoured by Melbourne Telugu Writers Group "భువన విజయం"


"భువన విజయం” ప్రారంభోత్సవం ! మెల్బోర్న్, ఆస్ట్రేలియా

"భువన విజయం” తెలుగు సాహితీ సంస్కృతీ సంవేదిక ప్రారంభోత్సవం 
"ఉగాది పండుగ పర్వదినం-2010"
మెల్బోర్న్ మహానగరం,ఆస్ట్రేలియా


COMFY


"భువన విజయం" సాహితీ సంస్కృతీ సంవేదిక 

I have established a Strong Base "భువన విజయం" for the development of Telugu Arts and Cultural Activities and to maintain our Traditional Heritage, Customs and Practices in Melbourne City, Australia.

The Telugu Literature wing of the above forum is separately functioning as an exclusive Group under the banner of "భువన విజయం" since then.

The main intention of this Group is to encourage and improve the creative writing capabilities / and to promote cultural development activities of the Telugu Community.

This Group has a large number of active participating members who are continuously contributing their might in the form of Telugu Articles to its various branches of Literature i.e., Padyam (Poetry), Gadyam (Prose), Geyam (Lyrics).etc., The conduct of Telugu Arts and Cultural Activities and
teaching of Telugu language is progressing satisfactorily.

"భువన విజయం" కేవలం కవులకే కాదు. అది అందరికీ చెందింది. సాహిత్యాభిమానులతో బాటుగా మెల్బోర్న్ లోని తెలుగు వారందరూ ఈ "సాహితీ సంస్కృతీ వేదిక” గ్రూప్ లో మెంబర్లుగా చేరి మన మాతృ భాషా సంస్కృతితో తమకి గల అనుబంధాన్నినిలబెట్టుకోవాలి!

Group Mail ID :MelboTeluguSahithi@yahoogroups.com

Telugu News Paper from Melbourne.

" ప్రవాస భారతి " మాసపత్రిక ప్రారంభోత్సవం 
మెల్బోర్న్, ఆస్ట్రేలియా - 06-8-2011






"ఆంధ్రజ్యోతి" సచిత్ర వార పత్రిక ప్రథమ బహుమతి - 1997

"ఆంధ్రజ్యోతి" సచిత్ర వార పత్రిక ప్రథమ బహుమతి ప్రదానోత్సవ సన్నివేశం ! 

వేదిక "రవీంద్ర భారతి" కళా క్షేత్రం ! 

నేను వ్రాసిన "హోమం" కథకి 16-8-1997 'న గౌరవనీయులు శ్రీ డాక్టర్.సి.నారాయణ రెడ్డి గారి ద్వారా మొదటి బహుమతి లభించింది. ఆ సందర్భంగానే అదే వేదికపై ప్రముఖ తెలుగు సాహితీ సంస్థ "రాజా లక్ష్మీ ఫౌండేషన్' (మద్రాసు)తో బాటుగా "తెలుగు కళా సమితి" న్యూజెర్సీ (అమెరికా) వారు కూడా నన్ను సన్మానించారు.

జ్ఞానపీఠాధిపతి శ్రీ సి.నారాయణ రెడ్డి కవిసార్వభౌమా! నమోనమః ! ఈ తరుణంలో లభించిన మీ ఆశీస్సులతో నా జన్మ తరించింది. కృతార్థుణ్ణి !.......యస్పీచారి.




Honoured by శ్రీ కే.వి.రమణాచారి, IAS, Executive Officer, TTD

2009 ’ లో నేను వ్రాసిన "భారత దర్శిని - INDIA TRAVEL GUIDE " గ్రంధాన్ని'తిరుమల తిరుపతి' దేవస్థానానికి అంకితం యిచ్చిన సందర్భంలో శ్రీ కే.వి.రమణాచారి,IAS, EO,TTD అందించిన శ్రీవారి జ్ఞాపిక బహూకృతిని స్వీకరిస్తూన్నదృశ్యం.

I was honoured by Sri K V Ramana Chary,
IAS, former EO, TTD who received my "INDIA TRAVEL GUIDE - Bharatha Darshini" book on behalf of Lord Venkateshwara Devasthanam,Tirumala Tirupati Devasthanam in the year 2009.


My sketch by Subhani !


I have attached your Sketch, Sir. with 300 dpi, u can use it for all purposes....Regards ...Subhani.

“యస్పీచారి” అనే నా పేరుమార్పు వెనుక కథ !

నిత్య జీవితంలో గత రెండు దశాబ్దాలుగా నా పేరు యస్పీచారిగా పిలువబడుతోంది. కాని మా ఇంట్లోనూ, బందువర్గాల్లోనూ నన్నిప్పటికీ పురుషోత్తంఅనే పిలుస్తుంటారు. అయితే విద్యార్థి దశలో నా పేరు యస్.పురుషోత్తమా చారిగా నమోదు చేయ బడింది. ఇంతకీ నా అసలు పూర్తి పేరు శేషం పురుషోత్తమా చార్య” . కాని ఆ పేరుని పూర్తిగా కుదించివేసి నేటి వర్ధమాన నవలా రచయిత’ “యస్పీచారిఅంటూ నన్ను ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చిన ఘనత మాత్రం ఆంధ్ర భూమి వారపత్రిక సంపాదకులు కీ.శే. శ్రీ సి.కనకాంబర రాజు గారికే చెందుతుంది. ఆ రకంగా నిలిచిపోయిన ఈ యస్పీచారిఅనే పేరుమార్పు వెనుక జరిగిన సంఘటనని మీకు వివరిస్తున్నాను. అదీ ప్రచురించబడిన ఈ క్రింది కథన రూపంలో..... 



"చండేరీ"-"మగధీర"...DC News 17-2-2014

Deccan Chronicle, Monday, 17-02-2014.

Today the Deccan Chronicle published the details about the stolen aspect of my story which I created for my Novel ("చండేరీ"). 'Chanderi' was published as serial in Andhra Bhoomi Weekly from 30- 4-1998 to 31-12-1998. The same story base of 'Chanderi' was illegally utilised for producing the mega hit movie, the 'Magadheera'("మగధీర").


చివరికి మిగిలేవి ! .
1953లో ప్రాచీన "ఆంధ్రరాష్ట్రము" మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆరుపదులేళ్లు దాటాయి. 1956లో సమైక్య ‘ఆంధ్రప్రదేశ్’ రాష్రం ఏర్పడింది.
ఆఆరు దశాబ్దాల చరిత్రకి అంతం పలుకుతూ గత కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం 17-02-2014 నాడు ‘ఆంధ్రప్రదేశ్’ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసేసింది.
దాంతో ఈరోజు 02-6-2014 భారత దేశపు 29’వ రాష్ట్రంగా ‘తెలంగాణా’ రాష్రం ఏర్పడింది. శ్రీ కే.చంద్రశేఖరరావు గారి మొట్టమొదటి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పదవీ స్వీకారం చేసింది.
ఈ మార్పు కారణంగా గత ఆరుదశాబ్దాల ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య సాంఘిక ఆనంద జీవన ఘడియలు కాస్తా కేవలం మిగిలిపోయిన చారిత్రిక జ్ఞాపకాలుగా రూపుదిద్దుకున్నాయి .
అలాంటి “కేవలం మిగిలిపోయే” జ్ఞాపకాల విషయంలో మహాకవి డాక్టర్ ‘సి.నారాయణరెడ్డి గారు ’ గతంలో నాకు వ్రాసిన ఉత్తరం !

డా. ఏ ఎస్ రావు నగర్ కాలనీ అసోసియేషన్

ECIL ఉద్యోగులు తమ డా. ఏ ఎస్ రావు నగర్ కాలనీ అసోసియేషన్
 'తెలుగు కళావేదికపై' నన్ను సన్మానించిన సందర్భం!



శ్రీ యస్.టి.వేణు గోపాలాచార్యుల కవితా జ్ఞాపిక !

" సాహితీ సుమాంజలి "

డా. ఏ ఎస్ రావు నగర్ కాలనీ అసోసియేషన్ వారు తమ 'తెలుగు కళాక్షేత్రం' వేదికపై నన్ను 1997 ఉత్తమ కథా రచయితగా గుర్తించి సన్మానించిన సందర్భంలో శ్రీ యస్.టి.వేణు గోపాలాచార్యులు నా పేరులోని అక్షరాల పద్యపాద పంక్తులుగా ఉపయోగించి వ్రాసి బహూకరించిన కవితా జ్ఞాపిక !

Time of the honour !

Time of the honour !

Hyderabad Film & Cultural Association has honoured eminent people of Arts for the year 1998 at Thyagaraya Gana Sabha. I was honoured as the Best Telugu Writer of the Year.

"హృదయ రాగం" ఉత్తమ పాఠక బహుమతి"

నేను వ్రాసిన సీరియల్ “హృదయ రాగం” ఆంధ్రభూమి వారపత్రిక (08- 6-1995 నుంచి 18-01-1996)...ప్రచురణ 33 వారాలు !... 
"ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక"లో నా సీరియల్ నవల "హృదయ రాగం" ముగింపు సందర్భంగా ఉత్తమ పాఠక బహుమతి"ని ప్రకటించింది పత్రిక యాజమాన్యం. విజేత ...నల్లకుంట నివాసి !...పాఠకురాలు !

లాటరీ ద్వారా ఎన్నుకోబడిన ఆ 'బహుమతి విజేత' ఇంటికి ఆరోజుల్లోని ప్రముఖ సినీనటుడు సుమన్, సినీనటి నిరోషాల యుక్తంగా వెళ్లి బహుమతిని అందచేసారు ఎడిటర్ శ్రీ కనకాంబర రాజు గారు. 



Honoured by AP State Minister Sri Kodela Prasada Rao

త్యాగరాయ గానసభ .... 14-10-1997 : 
అధిక సంఖ్యలో వర్ధమాన పాఠకులచే గుర్తించబడిన ఓ "సీరియల్ నవలా రచయిత" గా ఆంధ్ర ప్రదేశ్ రాష్ఠ్ర మంత్రివర్యులు శ్రీ కోడెల శివప్రసాద్ గారి ద్వారా స్వీకరించిన సత్కారం

Honoured by "Mallemala"


త్యాగరాయ గానసభ, హైదరాబాద్ ఫిలిం & కల్చరల్ సర్కిల్ ,1995.
ఎన్నుకోబడిన 'సమకాలీన విశేష రచయితల సమాహారం'లో ఒకడిగా "మల్లెమాల" శ్రీ యం.యస్.రెడ్డి గారిద్వారా అందుకున్న సత్కారం.
[As one of the prominent and noted Story Writer in Telugu honoured by "Mallemala" Sri M S Reddy on behalf of Hyderabad Film & Cultural Circle.]






చండేరీ” సీరియల్ బహుమతి ప్రకటన !

నా నవల 'హృదయరాగం ' - యండమూరి అభినందన

'ఆంధ్రభూమి' సచిత్ర వారపత్రికలో సీరియల్ 'గా వచ్చిన నా నవల 'హృదయరాగం ' 
పుస్తక రూపంగా విడుదల -1996.

‘శ్రీ కనకాంబర రాజు’ గారికి నా నవల “హృదయరాగం" అర్పితం


“ఆంధ్రభూమి సచిత్ర వార పత్రిక” సంపాదకులు ‘శ్రీ కనకాంబర రాజు’ గారికి నా నవల “హృదయరాగం” పుస్తకరూపంలో అర్పితం “ఆంధ్రభూమి" సచిత్ర వారపత్రిక”లో 08-6-1995 to 18-01-1996 “హృదయరాగం” సీరియల్’గా వెలువడింది.

నేను వ్రాసిన సీరియల్ నవలలు !

“ఎయిర్ హోస్టెస్” ... ఆంధ్ర ప్రభ వార పత్రిక 21-11-1973 నుంచి 19-12-1973 
“పడగనీడ” ... ఆంధ్ర ప్రభ వార పత్రిక 15-02-1994 నుంచి 04-05-1994 
“హృదయ రాగం” ... ఆంధ్ర భూమి వార పత్రిక 08- 6-1995 నుంచి 18-01-1996 
“చండేరీ” ... ఆంద్ర భూమి వార పత్రిక 30- 4-1998 నుంచి 31-12-1998]



నా "ఎయిర్ హోస్టెస్", "మ్యాడ్ రేస్" నవలలు

నేను వ్రాసిన మొదటి నవల "ఎయిర్ హోస్టెస్" .
నా రెండవ నవల “పడగనీడ” !

నా మొదటి నవల "ఎయిర్ హోస్టెస్"  'ఆంధ్రప్రభ' సచిత్ర వార పత్రికలో 21-11-1973 నుంచి 19-12-1973 దాకా సేరియల్'గా ప్రచురించబడింది కాని అది ఓ 'పెద్ద కథ" గా వెలువడటంతో పుస్తక రూపంలో రాలేకపోయింది.

నా రెండవ నవల“పడగనీడ” నవల  కూడా 'ఆంధ్రప్రభ' సచిత్ర వార పత్రికలో 15-02-1994 నుంచి 04-05-1994 దాకా సీరియల్'గా ప్రచురించబడి నేటికి యిరవయి సంవత్సరాలు గడిచాయి. 
ఈ నవల "మ్యాడ్ రేస్" పేరిట పుస్తక రూపంలో వెలువడింది.

“చండేరీ” నవల “మగధీర” మాతృక !

నేను వ్రాసిన చండేరీనవలని 'USA'లోని కౌముదిమాసపత్రిక జనవరి-2012 నుండి ఆగస్టు-2013 దాకా మళ్లీ సీరియల్ గా ప్రచురించింది.


Golden Jubilee celebrations of India's Independence.


A large scale function was organised by the ECIL Management at its Sports Complex 15-8-1997 in which I was honoured as one of the Prominent Telugu Writers of the decade in by Dr.Rao C Kasarbada, C&MD ECIL.

Dr.A.S.Rao, the founder of ECIL. His last visit.

Dr.A.S.Rao, the founder of ECIL.

Dr.A.S.Rao was invited to ECIL Factory premises by its Management on every major important occasion during his life time. I was fortunate enough to invite him for the last time to the dais in the year 1997. (Day of Completion of Three Decades of ECIL).

Dr.A S Rao was present on the occasion with Dr.Rao C Kasarabada,C & MD and Sri T H Prasad, Dir 
(P).

మిమిక్రీ శ్రీనివాస్ Press Statement on 30-11-1990

                           Unforgettable achievement of my most dearest friend... మిమిక్రీ శ్రీనివాస్ !
32 Hours non-stop Mimicry Show a World Record. 


Mimicry Srinivos:

My master శ్రీ నేరెళ్ళ వేణు మాధవ్ గారు blessing me on 13th November 1990 before i started my 32 hour non-stop mimicry show at Thyagaraya Gana Sabha, Hyderabad. Many friends, artists , writers, were with me and actor friend Uttej helped me whenever I was taking a brief 5 minutes rest during the show. A full medical checkup was conducted after the completion of my show.

The Programme was organised by Hyderabad Film and Cultural Circle for which శ్రీ "యస్పీచారి" was the Chairman. About 5000 attended the programme. 

At the end of the show.. శ్రీ యస్పీచారి honoured me on behalf of the Organisation.


ప్రాంతీయ ఐక్యతే తెలుగుజాతి సౌఖ్యత !

ప్రాంతీయ ఐక్యతే తెలుగుజాతి సౌఖ్యత ! ......

భాషైక, సాంస్కృతిక, సాంఘికఅనుబంధాలే తెలుగు జాతికి బలిమి, కలిమి! భవిష్యత్తులో ప్రాంతీయ రాజకీయ అస్థిరతలు తెలుగు సామాజిక సుస్థిరతలకు చేటుగా పరిణమించకూడదు. ప్రాంతీయ ఐక్యత, సఖ్యతా భావాలే తెలుగుజాతి సౌఖ్యతకు మార్గదర్శకాలుగా నిలబడిపోవాలి !

తెలుగు జాతి ఈనాడు అనేక భౌగోళిక ప్రాంతాలలో వ్యాపించి ఉంది. ఆంధ్ర ప్రదేశ్ పేరిట తొమ్మిది కోట్ల మంది తెలుగు ప్రజలు ఒకే రాజకీయ కట్టడిలో కలిసి వుండటం అనేక కారణాలవలన నేడు ప్రశ్నార్ధకంగా మారింది. ఈ కట్టడికి బయటవున్న మరికొన్నికోట్ల తెలుగు ప్రజలు యిక్కడి పరిణామాలను బాధాపూరితమైన ఆసక్తితో గమనిస్తున్నారు.

తెలుగు ప్రజల మధ్య రగిలిన రాజకీయ చిచ్చు వలన వివిధ ప్రాంతాల తెలుగు సోదరుల మధ్య భావోద్రేకాలు రగులుతున్న వేళ ... వాటికి సంబంధించిన చారిత్రిక కారణాలను, రాజకీయ నేపథ్యాలనూ చర్చించే సమయం కాదిది. ఇప్పటి ఘర్షణ మౌలికంగా ప్రజల మధ్య రగిలిన ఘర్షణ కాదు; ఎవరికీ అదుపు లేని ఒక రాజకీయ ప్రహేళిక అంతటా పరచుకున్నప్పుడు, సామాన్య ప్రజలంతా మూగ సాక్షులే అవుతారు!

తెలుగునాట సామాజిక ఉద్యమాలు, సామాజిక నేతృత్వం బలంగా ఎదగక పోవడమే నేటి ఉద్విగ్న పరిస్థితికి ప్రధాన కారణం. ఇప్పుడున్న ఆవేశ కావేశాలు తొలగిన అనంతరం ప్రశాంత వాతావరణంలో నేటి పరిస్థితి గురించి సమీక్షించుకోవచ్చు. ఇప్పుడు మనందరి కర్తవ్యం ... అందరం మౌలికంగా ఒకే కుదురుకి చెందినవాళ్ళమన్న భావాన్ని చెక్కు చెదరకుండా కాపాడడం!

తెలుగు జాతి యొక్క అవిచ్ఛన్న పరంపరను బలోపేతం చేసేందుకు - తెలుగు జాతి ఐక్యత, అభ్యుదయాలపట్ల ఆకాంక్షలుగల సామాజిక నేతలు, సాహితీవేత్తలు తమ కృషిని మరింత పట్టుదలతో కొనసాగించాలి. ప్రాదేశిక వైరుధ్యాల వాదాలను బలంగా నమ్ముతున్నవాళ్ళు, తదితరులూ కూడా యిప్పటి రాజకీయ ఆందోళనలు తెలుగు జాతి మౌలిక ఐక్యతకు దెబ్బ తగలని విధంగా వ్యవహరించాలి.

'తెలుగు జాతి' అన్నది భౌగోళిక అస్తిత్వం కావాల్సిన అవసరం లేదు; చరిత్రలో అనేక రాజకీయ, పాలనా వ్యవస్థలలో జీవించినప్పటికీ, నాటి ప్రజానీకం తమలోని ఐక్యతా భావాన్ని చెక్కు చెదరనీయ లేదు; అదే స్ఫూర్తి ఎల్లప్పుడూ కొనసాగాలి.

ఈ బాంధవ్యాన్ని బలపరిచే కొలదీ అది అందరికీ ఆత్మబలం సమకూరుస్తుంది. అది బలహీనపడినప్పుడు మనలో శూన్యతా భావాన్ని కలుగ చేస్తుంది; పరాయీకరణకు దారి తీస్తుంది. సహజ ప్రగతిని కుంటుపరుస్తుంది. కనుక పట్టుదలతో వివిధ రాష్ట్రాలలో, వివిధ దేశాలలో నివసిస్తున్న తెలుగు ప్రజలలో ఉన్న ఐక్యతా భావాన్నిబలోపేతం చెయ్యడం మనందరి కర్తవ్యం !

భారత దేశపు 29’వ రాష్ట్రంగా ‘తెలంగాణా’ 02-6-2014

చివరికి మిగిలేవి ! .

1953-2013 సంవత్సరాంతంలో సమైక్యతని కొనితెచ్చిన అలనాటి ప్రాచీన "ఆంధ్రరాష్ట్రము" మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆరుపదులేళ్లు దాటాయి.

ఆఆరు దశాబ్దాల చరిత్రకి అంతం పలుకుతూ గత కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం 17-02-2014 నాడు ‘ఆంధ్రప్రదేశ్’ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసేసింది.

దాంతో ఈరోజు 02-6-2014 భారత దేశపు 29’వ రాష్ట్రంగా ‘తెలంగాణా’ రాష్రం ఏర్పడింది. శ్రీ కే.చంద్రశేఖరరావు గారి మొట్టమొదటి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పదవీ స్వీకారం చేసింది.

ఈ మార్పు కారణంగా గత ఆరుదశాబ్దాల ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య సాంఘిక ఆనంద జీవన ఘడియలు కాస్తా కేవలం మిగిలిపోయిన చారిత్రిక జ్ఞాపకాలుగా రూపుదిద్దుకున్నాయి .

అలాంటి “కేవలం మిగిలిపోయే” జ్ఞాపకాల విషయంలో మహాకవి డాక్టర్ ‘సి.నారాయణరెడ్డి గారు ’ గతంలో నాకు వ్రాసిన ఉత్తరం !

తెలుగునేల మనది ! తెలంగాణ మనది ! సీమాంధ్ర మనది !

తెలుగునేల మనది !
తెలంగాణ మనది.. సీమాంధ్ర మనది..

ఇక్కడున్నా.. అక్కడున్నా ..ఎక్కడున్నా
తెలుగునేల మనది ... తెలుగునాడు మనది

జన్మజన్మల జనావళి విబేధాలు
నీరుగారిన గతజలసేతు బంధనాలు

యుగయుగాలుగా వెలుగుతున్న తెలుగు జ్యోతి మనది
మూడు తెలుగునాడులు కలిసిన తెలుగునేల మనది

మహాభారతం పుట్టింది రాజమహేంద్రవరంలో
భాగవతం జనించింది ఏకశిలానగరంలో
అష్ఠదిగ్గజాల భువనవిజయం రాయలసీమలో

ప్రాంతాలు వేరైనా మన జన్మ సంస్కృతి ఒక్కటే
దూరాలు వేరైనా మన భాష తెలుగు ఒక్కటే

ఇక్కడున్నా.. అక్కడున్నా ..ఎక్కడున్నా
తెలంగాణ మనది...తెలుగునాడు మనది !

ఐదు దశాబ్దాల ఐకమత్యం ! (ఆంధ్రజ్యోతి -01-9-2010)

Masonic Lodge in Melbourne

My visit to Werribee Masonic Lodge in Melbourne,Australia -2011.

Having received an invitation from W.Bro.A Wallace, Worshipful Master, Lodge Enterprise No.740, I have attended their year end Regular Meeting. I was picked up by W.Bro.Chitran (Indian) from my home in Belworth Avenue, Harmony Road,Tarneit.

W.Bro.JB Johna Morgan, Secretary of the Lodge spoke about my masonic back ground in detail for which I thanked him. I also thanked WM and the members of the Lodge for giving me an opportunito to visit their Lodge.

We had a group photo after the meeting:

Worshipful Master -1997

                                 My Masonic life in brief (FREEMASONRY)


I have joined freemasonry on 05-4-1985. I was installed as Worshipful Master of Lodge Ekram No.45,Hyderabad (India) by M.W.Bro.K L Reddy,OSM, the Grand Master of India in the year 1997. It was a great privilege... that I received in my life because I am the first Worshipful Master in entire India to get installed by the Most Worshipful Grand Master of Grand Lodge of India . Subsequently I also served as Worshipful Master of Lodge Abhayarudra No.278,Warangal in the year 2002. My photograph with M.W.Bro.K L Reddy, Grand Master of India and R.W.Bro.Raja Shekharan Nair, Regional Grand Master (Southern India) on my installation night.



Lodge Ekram No.45
Group photograph with brethren of Lodge Ekram No.45, Secunderabad and guests from the Lodges of Twin Cities with M.W.Bro.K L Reddy, Grand Master of India and R.W.Bro.Raja Shekharan Nair, Regional Grand Master (SI) on my installation as Worshipful Master in the year 1997.